Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2015 16:59:42
facebook Twitter Googleplus
Photo

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు .. ఒక్క హిట్టు దర్శకుల లైఫ్ స్టయిల్ నే మార్చేస్తోంది. తమ నిర్మాతల నుంచి భారీ కానుకలు అందుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీ అవుతున్నారు. ఇలాంటి సాంప్రదాయం బాలీవుడ్ లో ఎక్కువగా ఉంటుంది. హిట్టిచ్చిన దర్శకుడికి నిర్మాతలు - హీరోలు ఖరీదైన కానుకలు ఇచ్చి సర్ ప్రైజ్ లు ఇస్తుంటారక్కడ. ఇప్పుడు అదే ట్రెండ్ టాలీవుడ్ లోనూ విస్తరించింది. మొన్నటికి మొన్న కొరటాల ఆడి ఏ6 కార్ ని కానుకగా అందుకున్నాడు. మహేష్ హీరోగా అతడు తెరకెక్కించిన శ్రీమంతుడు ఘనవిజయం సాధించినందుకు ప్రశంసా పూర్వకంగా ప్రిన్స్ మహేష్ ఈ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఇప్పుడు ఈరోజుల్లో - ప్రేమకథా చిత్రమ్ - భలే భలే మగాడివోయ్ వంటి హిట్ చిత్రాల్ని అందించిన మారుతి కూడా ఓ ఖరీదైన కానుకను అందుకోబోతున్నాడు. ఇటీవలే నాని హీరోగా మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఇంటా బైటా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇంత పెద్ద హిట్టిచ్చినందుకు నిర్మాత కం పంపిణీదారుడు అల్లు అరవింద్ ఓ ఖరీదైన కార్ ని మారుతికి కానుకగా ఇవ్వాలనుకున్నారు. అతడు ఏకంగా బిఎండబ్ల్యూ కార్ నే కానుకగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నానని చెబుతున్నారు.

ఏదేమైనా ఈ నయా ట్రెండ్ దర్శకుల రేంజును పెంచేస్తోంది. మరి మారుతికి - కొరటాలకే ఇలాంటి కానుకలు ఉంటే రాజమౌళి - త్రివిక్రమ్ - వినాయక్ లాంటి దర్శకులకు ఎన్ని కార్లు కానుకగా అందుతాయో? వాళ్లు తమ కానుకల్ని దాచుకోవడానికి ముందుగా ఓ గొడౌన్ కొనుక్కోవాలేమో?

,  ,  ,  ,