Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 12:22:40
facebook Twitter Googleplus
Photo

లోకనాయకుడు కమల్ హాసన్ - గ్లామరస్ బ్యూటీ శృతిహాసన్ నిజ జీవితంలో తండ్రీ కూతుళ్ళు.. అయితే వీరిద్దరూ తమ పొజిషన్లలో టాప్ రేంజ్ లో వున్నా ఇద్దరూ కలిసి నటించడానికి ఆస్కారం వున్నా ఇప్పటివరకూ ఇద్దరూ వెండితెరపై కలిసి కనిపించలేదు. కమల్ నటించిన ఈనాడు చిత్రానికి మాత్రం శృతి సంగీతం అందించి చివర్లో పాట ద్వారా మెరిసింది.

అయితే ఈ ఇద్దరినీ కలిపి ఒకేసారి వెండితెరపై చూడనున్నాం. విచిత్రమేమిటంటే ఈ ప్రాజెక్ట్ లో కూడా కమల్ - శృతి తండ్రీ కూతుళ్ళగానే కనిపించనున్నారట. రాజీవ్ కుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఈ నెలాఖరున లాంచనంగా ప్రారంభంకానుంది. తెలుగు - తమిళ భాషలలో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

ప్రస్తుతం కమల్ విశ్వరూపం 2 ని ఎలాగైనా పూర్తిచేసి విడుదల చేసే పనిలో వున్నాడు. శృతి సైతం ప్రేమమ్ షూటింగ్ లో బిజీ బిజీ. వీరి పనులు పూర్తవ్వగానే ఈ సినిమాకు కాల్ షీట్లు ఇచ్చే అవకాశం వుంది.

,  ,  ,  ,  ,