Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 10:57:55
facebook Twitter Googleplus
Photo

కమల్ హాసన్ నాలుగేళ్ల క్రితం నిర్మించి నటించిన విశ్వరూపం మంచి విజయాన్నే అందుకుంది. ఓ అండర్ కవర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా లోకనాయకుడు కమల్ నటన అందరినీ ఆకట్టుకుంది. విశ్వరూపం సినిమా కథ ముగిసిపోలేదని... రెండో పార్ట్ కంటిన్యూ అవుతుందని ఫస్ట్ పార్టులోనే క్లియర్ గా చెప్పారు. దానికితోడు విలన్ వేసిన ప్లాన్ ను భగ్నం చేయడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. సుదీర్ఘ విరామం తరవాత విశ్వరూపం-2 మూవీని కమల్ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు.

విశ్వరూపం-2 ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వర్కింగ్ స్టిల్ ను కమల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశాడు. ఇందులో హీరో తోపాటు హీరోయిన్ ఆండ్రియా కూడా ఆర్మీ ఆఫీసర్ డ్రస్ లో కనిపించింది. ఇదే సందర్భంలో కమల్ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కూడా అభిమానులకు షేర్ చేశాడు. ‘‘విశ్వరూపం-2 షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. ఇందులో భాగంగా చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చూశాను. ఈ అకాడమీ మాత్రమే మహిళా అధికారులకు ఇక్కడ శిక్షణ ఇస్తోంది. మహిళలకు - ముఖ్యంగా నా భారతమాతకు సెల్యూట్ చేస్తున్నా. మా తుఝే సలామ్’’ అంటూ ట్వీట్ చేశాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటులు రాహుల్ బోస్ - శేఖర్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వరూపం ఫస్ట్ పార్ట్ కథ మొత్తం యూఎస్ లో సాగగా.. సెకండ్ పార్ట్ మొత్తం ఇండియాలోనే సాగుతుంది.

,  ,  ,  ,  ,