Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2016 18:06:55
facebook Twitter Googleplus
Photo

నిజంగా ఇది సెన్సేషనల్ న్యూసే మరి. ?గౌతమీ పుత్ర శాతకర్ణి?లో ఓ సెన్సేషనల్ యాక్టర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆ నటుడు మరెవరో కాదు.. రానా దగ్గుబాటి. ?బాహుబలి?లో భల్లాలదేవుడి పాత్రతో రానా ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ?రుద్రమదేవి?లో సైతం ఓ ముఖ్య పాత్రలో మెప్పించిన రానా.. చారిత్రక సినిమాల్లో పాత్రలకు తాను మంచి ఛాయిస్ అని రుజువు చేసుకున్నాడు.

బాలయ్య సినిమాలో రానా ఓ పాత్ర చేస్తే జనాల్లో మరింత ఆసక్తి కలగడం ఖాయమన్న ఉద్దేశంతో ఓ కీలక పాత్రకు అతణ్ని ఎంచుకున్నాడట క్రిష్. రానా ఇప్పటికే క్రిష్ తో ఓసారి పని చేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ?కృష్ణం వందే జగద్గురుం? వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా రానా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రంగా చెప్పొచ్చు. ఇప్పుడిక ?గౌతమీపుత్ర శాతకర్ణి?లో రానా కోసం క్రిష్ ఎలాంటి పాత్ర రెడీ చేశాడో.. దాన్ని రానా ఎలా చేస్తాడో.. బాలయ్య-రానా మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.

ప్రస్తుతం శాతకర్ణి షూటింగ్ మొరాకాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ భారీ వార్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారక్కడ. దీని కోసం రోజుకు 12 గంటల దాకా కష్టపడుతున్నాడట బాలయ్య. క్రిష్ అయితే రేయింబవళ్లు శ్రమిస్తున్నాడట. రూ.8 కోట్ల ఖర్చుతో ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇది ముగించుకుని హైదరాబాద్ వచ్చాక ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరో ప్రకటిస్తారు. ఆ సందర్భంగానే రానా పాత్ర గురించి కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నటులు హేమమాలిని..కబీర్ బేడీ నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా కూడా యాడ్ అయ్యాడంటే బాలీవుడ్లోనూ ఈ సినిమా మీద హైప్ రావడం ఖాయం.

,  ,  ,  ,  ,