Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2015 11:39:51
facebook Twitter Googleplus
Photo

విలక్షణ నటుడు కమలహాసన్ సినిమాలో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్లు వుంటారు. అప్పుడప్పుడు ముగ్గురు కూడా నటిస్తుంటారు. కథ విస్తృతిని బట్టి హీరోయిన్ల పాత్రలు కూడా మారుతుంటాయి. ఈ క్రమంలో ఆయన నటించే తాజా చిత్రంలో కూడా ముగ్గురు ముద్దుగుమ్మలు నటించనున్నారు. తన అసోసియేట్ రాజేష్ కి దర్శకునిగా అవకాశం కల్పిస్తూ కమల్ ఓ జేమ్స్ బాండ్ తరహా చిత్రాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఆయన పక్కన త్రిష, మనీషా కొయిరాల, అనైక సోథి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. త్రిష, మనీషా గతంలో కమల్ సరసన నటించినప్పటికీ, అనైకకు మాత్రం ఆయనతో ఇదే తొలి సినిమా!

,  ,  ,  ,  ,