Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 12:56:39
facebook Twitter Googleplus
Photo

నందమూరి బ్రదర్స్ కు మాత్రం కాసుల పంట పండించిందనే చెప్పాలి. చివరకు 86 కోట్లు వసూలు చేస్తుందో లేదో తెలియదు కాని.. ఆల్రెడీ 70 కోట్ల షేర్ తో దూసుకుపోయింది. ఇక సినిమా రిలీజయ్యాక నాలుగు రోజులు ప్రమోట్ చేసిన ఎన్టీఆర్ కూడా చాలా రిలాక్స్డ్ గా యురోప్ టూరుకు వెళిపోతున్నాడు. అయితే తదుపరి సినిమా త్రివిక్రమ్ తోనే అని ఆల్రెడీ చెప్పేశాడు. ఈ సినిమాపై ఇప్పుడు మరో అప్డేట్ వినిపిస్తోంది.

నిజానికి అక్టోబర్ నెలంతా కూడా ఎన్టీఆర్ టూర్లోనే గడిపేస్తాడట. ఈ టూర్ పూర్తవ్వగానే నవంబర్ నెలలో త్రివిక్రమ్ డైరక్షన్లో మొదలయ్యే సినిమాకు కొబ్బరికాయ కొడతారు. కాని షూటింగ్ మాత్రం వెంటనే స్టార్ట్ అవ్వకపోవచ్చు అంటున్నారు సన్నిహితులు. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా సంక్రాంతికి రిలీజయ్యాక.. మాటల మాంత్రికుడు కూడా ఒక చిన్న ఫారిన్ వెకేషన్ కు వెళ్ళొచ్చి.. అప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతాడట. అంటే దాదాపు ఫిబ్రవరి లేదా మార్చి నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్సుంది. చూస్తుంటే అప్పటివరకు ఎన్టీఆర్ బ్రేక్ తీసుకుంటాడనే అనుకోవాలి మరి.

ఇకపోతే ఈ సినిమాలో అను ఎమ్యానుయేల్ హీరోయిన్ గా చేస్తోందా లేదంటే ఇలియానాను తీసుకున్నారా అంటే.. అసలు ఇప్పటివరకు ఈ సినిమా తాలూకు నటీనటులు మరియు సాంకేతిక నిపుణులపై ఒక్క డెసిషన్ కూడా తీసుకోలేదు అంటున్నారు సినిమా నిర్మాతల తాలూకు సన్నిహితులు

,  ,  ,  ,  ,