Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2015 12:33:02
facebook Twitter Googleplus
Photo

దర్శకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడం అంత తేలికైన పని కాదు. ఇక ఆ సినిమా ఆడుతుందో లేదో తెలియకపోయినా కావలసినంత డబ్బు ఖర్చుచేయడం కూడా ఆషామాషీ విషయం కాదు. కీలకమైన ఈ రెండు బాధ్యతలు తీసుకుని, కథానాయకుడిగా సినిమా భారాన్ని పూర్తిగా మోయడం ఇంకా కష్టమైనా విషయం. ఇంతటి కష్టతరమైన పనిని ఒక తపస్సులా చేస్తూ సక్సెస్ ని సాధిస్తున్నాడు లారెన్స్.

తాజాగా ఆయన రూపొందించిన 'కాంచన 2'చిత్రం ఇప్పటివరకూ 108 కోట్లు వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. కేవలం 17 కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా ఏ స్థాయి లాభాలను తెచ్చిపెట్టిందో అర్థమైపోతోంది. భారీ హంగులు .. ఆర్భాటాలు ఉంటేనే సినిమా ఆ స్థాయి వసూళ్లను రాబడుతుందనే వారి అంచనాలను తలకిందులు చేస్తూ, కాంచన వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

,  ,  ,  ,  ,  ,  ,