Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 10:43:48
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని తహతహలాడిపోతున్న సంగతి తెలిసిందే. ఇంకా రిలీజ్ కాకుండానే ఓ కన్నడ సినిమా మీద ఆమెకు మనసు మళ్లింది. అందుకు ఆ దర్శకుడు తీసిన తొలి సినిమానే కారణం. తాను చెప్పిన వైవిధ్యమైన కథతో సినిమా చేయడానికి ఏ నిర్మాతా ముందుకు రాని పరిస్థితుల్లో.. సోషల్ మీడియా ద్వారా క్రౌడ్ ఫండింగ్ తో నిధులు సేకరించి రెండేళ్ల కిందట ?లూసియా? పేరుతో ఓ సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు కన్నడ దర్శకుడు పవన్ కుమార్. ఆ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దాన్ని సమంత మాజీ బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ తమిళంలో రీమేక్ చేశాడు. ఆ సమయంలోనే పవన్ తో పరిచయం పెంచుకున్న సమంత.. అతను తీసిన రెండో సినిమా ?యు టర్న్? మీద ఆసక్తి చూపించింది.

ఆ మధ్య ?యు టర్న్? ట్రైలర్ రిలీజవ్వగానే సమంత ఇంట్రెస్ట్ రెట్టింపైంది. తన ?ఫ్రెండ్? నాగచైతన్యను వెంటబెట్టుకుని వెళ్లి ఈ సినిమా రషెస్ చూసి వచ్చి తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ చేస్తే తాను నటించడానికి ఓకే అనేసింది. నిర్మాత కూడా సెట్టయ్యాడు. ?యు టర్న్? ఈ నెల 20వ తేదీన కర్ణాటకలో రిలీజైంది. పవన్ తొలి సినిమా మాదిరే దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓ యూటర్న్ దగ్గర వరుసగా కొందరు వ్యక్తులు చనిపోతుంటే.. దాని చుట్టూ ఉన్న మిస్టరీని ఛేదించే నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. హాలీవుడ్ రేంజిలో ఉందంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కన్నడలో పెద్దగా పేరున్న నటీనటులేమీ నటించలేదు. ఐతే తెలుగు-తమిళ భాషల్లో సమంత లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తే దానికుండే క్రేజే వేరుగా ఉంటుంది. సమంత నటించే తర్వాతి సినిమా ఇదే కావచ్చు. త్వరలోనే దీని గురించి అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయి

,  ,  ,  ,  ,  ,