Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2015 11:26:03
facebook Twitter Googleplus
Photo

ఇతర కథానాయికల కంటే తాను భిన్నమని తన సినిమాల ఎంపిక ద్వారా నిరూపిస్తోంది జాతీయ ఉత్తమనటి కంగనా రనౌత్. ఫక్తు కమర్షియల్ సినిమాలు కాకుండా, వైవిధ్యమున్న కథలనే ఆమె ఎంచుకుంటోంది. ఆ కోవలో తాజాగా ఆమె విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో నటించడానికి సంతకం చేసింది. ఈ సినిమా పేరు 'రంగూన్'. నేటి మయన్మార్ కు పూర్వపు నామమిది. ఈ చిత్ర కథాంశం కూడా కొత్తగా వుంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఇది సాగుతుంది. ఆ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్)కి ... బ్రిటిష్ సైన్యానికి మధ్య జరిగిన సంగ్రామంలో భారతీయులను భారతీయులే ఎలా సంహరించారన్న అంశంతో ఇది తెరకెక్కుతోంది. ఇందులో కంగనా పాత్ర అన్ని రసాలతోనూ నిండి ఉంటుందట. సయీఫ్ ఆలీఖాన్, షాహిద్ కపూర్ హీరోలుగా నటించనున్న ఈ సినిమాలో కొన్ని వివాదాస్పద అంశాలను కూడా స్పృశిస్తున్నట్టు చెబుతున్నారు.

,  ,  ,  ,  ,