Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 12:15:54
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోస్టర్ లో పేరు చూడగానే.. థియేటర్లకు జనాలు క్యూ కట్టేంత ఇమేజ్ ఉన్న డైరెక్టర్ ఆయన. మాటలతోనే మాయ చేసే ఈయన.. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని అందరి అరచేతుల్లోకి వచ్చేస్తున్నాడు.

జస్ట్ ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. యాప్ రూపంలో త్రివిక్రముడి సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇ సోమవారం అంటే నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే. ఈ సంర్భంగా.. ఈయనకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అని అందించే మొబైల్ యాప్ ను 'Trivikram Srinivas' పేరుతో తయారు చేసింది ఏబీసీ డిజిటల్ మీడియా అనే టెక్నాలజీ సంస్థ. ఇందులో ఆయన ప్రొఫైల్.. సినిమాల వివరాలు.. ఫోటో గ్యాలరీ.. స్పీచెస్.. అవార్డులు.. ఆయన సినిమాల్లోని పాటలు.. అన్నిటికి మించి త్రివిక్రమ్ డైలాగులు... ఇలా త్రివిక్రమ్ గురించిన సమస్త సమచారం అందుబాటులో ఉంటుంది. త్రివిక్రమ్ తీసిన సినిమాలను కూడా పూర్తిగా యాప్ లోనే(యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినవి) హై క్వాలిటీతో వీక్షించే సదుపాయాన్ని కూడా కల్పించారు.

ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటామని కూడా యాప్ మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం యాండ్రాయిడ్ వెర్షన్ మాత్రం అందుబాటులోకి రాగా.. త్వరలో మిగిలిన ప్లాట్ ఫామ్స్ పై కూడా విడుదల చేయనున్నారట. ఓ టాలీవుడ్ దర్శకుడి గుట్టు మొత్తం.. ఇలా మొబైల్ యాప్ లోకి రావడం ఇదే మొదటి ప్రయత్నం.

,  ,  ,  ,  ,  ,