Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-May-2017 13:20:58
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్లో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్ కంగనా రనౌత్. క్వీన్.. తను వెడ్స్ మను.. రివాల్వర్ రాణి లాంటి సినిమాలతో ఆమె తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో మణికర్ణిక అనే భారీ బడ్జెట్ మూవీ మొదలైంది. ఇది ఝాన్సీ లక్ష్మీబాయి కథతో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం. మన క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఐతే ఈ సినిమా తర్వాత కంగనా నటిగా కొనసాగాలని అనుకోవట్లేదట. ఆమె తనలోని కొత్త టాలెంట్ చూపించబోతోందట. స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తుందట. ఐతే అది కూడా ఒక్క సినిమాతో ఆగిపోదట. వరుసగా సినిమాలు తీసి ఫిలిం మేకర్ గా కూడా గొప్ప పేరు తెచ్చుకుంటానని అంటోంది కంగనా.

నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు ఇంటి నుంచి వచ్చేశాను. నేను ఏదో సాధిస్తానని అప్పుడు అనుకోలేదు. సినిమా విజయం...అపజయం మధ్యే నా జీవిత చక్రం ఉండిపోకూడదు అనుకుంటున్నాను. అందుకే కేవలం నటన మీదే దృష్టిపెట్టి సమయం వృథా చేసుకోవడం ఇష్టం లేదు. నటనతోనే నా ప్రస్థానం ఆగిపోకుండా మరో దశలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాను. ఫిలిం మేకర్ గానూ ఎదగాలనుకుంటున్నా. అందుకే నాతో సినిమా చేసే చివరి దర్శకుడు మీరే అంటూ క్రిష్ కు కూడా చెప్పేశాను. నేను త్వరలోనే నేను మెగాఫోన్ పట్టుకోబోతున్నాను. మణికర్ణిక తర్వాత ఆ చిత్రం ఉంటుంది. అది పూర్తిస్థాయి కామెడీ సినిమా అంటూ తన డైరెక్షన్ ప్లాన్స్ గురించి వివరించింది కంగనా.

,  ,  ,  ,  ,