Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2016 11:24:38
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్.. డైరెక్షన్- ప్రొడక్షన్ లోనే కాదు.. డిస్ట్రిబ్యూషన్ లో కూడా దిట్ట. తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఈయనకు చాలా బాగా తెలుసు. సంచలనాలు సృష్టించిన తెలుగుమూవీ బాహుబలి:ది బిగినింగ్ హిందీ వెర్షన్ హక్కులు కొనుగోలు చేసిన కరణ్ జోహార్.. ఇప్పుడు మరో సౌత్ బిగ్గీపై కన్నేసినట్లుగా కనిపిస్తోంది.

నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉన్న కోలీవుడ్ డైరెక్టర్.. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న 2.0 చిత్రానికి.. ఫస్ట్ లుక్ లాంఛ్ కార్యక్రమాన్ని కరణ్ జోహార్ కు చెందిన స్టూడియోలోనే ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ పేరు వినగానే.. బాలీవుడ్ అలర్ట్ అవుతుందని అనడంలో సందేహం అక్కర్లేదు. ఇలా రోబో సీక్వెల్ 2.0ను.. కరణ్ జోహార్ స్టూడియోలో నిర్వహించడానికి కారణం.. హిందీ వర్షన్ లో ఆయనకు కూడా భాగం ఉండడమే అని అంటున్నారు. 2.0 హిందీ హక్కులను.. కరణ్ కొనుగోలు చేయనున్నాడనే వార్తలు మొదలైపోయాయి.

అయితే 2.0 బిజినెస్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. బాహుబలి2 విషయంలో కరణ్ జోహార్ వెనక్కు తగ్గాడనే టాక్ ఉంది. మొదటి భాగంతో పోల్చితే.. ఇప్పుడు భారీగా రేట్లు ఎక్కువ కావడమే కారణమట. అందుకే బాహుబలి2 నుంచి తన కాన్సంట్రేషన్ ను రజినీపై ఫోకస్ చేశాడట కరణ్. 2.0పై కన్ను పడ్డంతోనే.. బాహుబలిని వదిలేశాడనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,