Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2017 13:52:48
facebook Twitter Googleplus
Photo

హీరోగా నటించిన తీరన్ అధికారం ఒండ్రు చిత్రం ఈ నెల 17న విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని ఖాకీ పేరుతో తెలుగులో కూడా అదే రోజున విడుదల చేయనుండగా.. ప్రస్తుతం టాప్ ఫాంలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించడం.. ప్లస్ పాయింట్ కానుంది. మరో 10 రోజుల్లో సినిమా రిలీజ్ కావడంతో.. ఇటు తెలుగులో కూడా తెగ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు కార్తీ.

రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తనపై పర్సనల్ గా వచ్చిన విమర్శలు.. ఆరోపణలపై కూడా సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా తమన్నాతో తనకు లింక్ ఉందంటూ వచ్చిన వార్తలను అయితే ఎంజాయ్ చేశానంటున్నాడు కార్తీ. 'ఒక హీరో-హీరోయిన్ రిపీటెడ్ గా నటించడం అంటే ఇలాంటివి సహజం. పత్రికలకు.. టీవీలకు కూడా స్పైసీ న్యూస్ కావాలి కదా. అయినా.. హిట్ సినిమా పెయిర్ అంటే మాత్రం ఇలాంటివి కచ్చితంగా వస్తాయి. ఆవారా లాంటి హిట్ తర్వాత సహజమే. అదే సినిమా ఫ్లాప్ అయితే ఎవరూ పట్టించుకోరు' అన్నాడు కార్తీ.

అయితే.. అప్పట్లో ఇలాంటివి బాగా ఎంజాయ్ చేశానని చెబుతున్న కార్తీ.. ఇప్పుడు కాసింత కష్టమే అంటున్నాడు. 'లవ్ సీన్స్ లో ముట్టుకోకుండా యాక్ట్ చేయలేవా అని నా వైఫ్ అడుగుతుంటుంది. కానీ యాక్టింగ్ విషయంలో నేను కొంచెం ఎక్స్ ట్రా. ఆ సీన్ పర్ఫెక్ట్ గా పండడానికి అన్నీ చేస్తాను. షూటింగ్ చేసేటపుడు మేమేమీ ఒంటరిగా ఉండము. చుట్టూ వంద మంది చూస్తుంటారు.

,  ,  ,  ,