Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2015 15:57:27
facebook Twitter Googleplus
Photo

సూర్య తమ్ముడు కార్తీ గురించేనా...? ఇంతకీ కార్తీ ఏం చేశాడు? చంచల్ గూడ జైల్ కి ఎందుకు వెళ్లాడు? .... ఇలాంటి ప్రశ్నలే మీ మనసును సంధిస్తున్నాయి కదూ! కానీ కంగారుపడకండి. కార్తీ చంచల్ గూడ జైల్ కి వెళ్లింది షూటింగ్ కోసమే.

ఆయన నాగార్జునతో కలిసి `ఊపిరి` అనే సినిమాలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాల్ని చంచల్ గూడ జైల్లో తెరకెక్కించాల్సి వుందట. అయితే జైలు అధికారులు లోపల షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. బయటయితే షూటింగ్ చేసుకోవచ్చని చెప్పారట. దీంతో జైలు బయటే పని కానిచ్చేస్తున్నారు.

కార్తీతో పాటు - అలీ - ప్రవీణ్ లాంటి కమెడియన్లు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. విషయం తెలిసి చుట్టుపక్కల ప్రాంతాలవాళ్లంతా చిత్రీకరణ చూడటం కోసం గుమికూడారట. ఖైదీల్ని కలుసుకోవడానికి వచ్చిన వారి బంధువులు పనిలో పనిగా కార్తీ - అలీలతో ఫొటోలు కూడా తీయించుకుంటున్నారు.

ఫ్రెంచి చిత్రం ఇంటచ్ బుల్స్ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. నాగార్జున - కార్తీ కథానాయకులుగా నటిస్తుండగా తమన్నా - గాబ్రియేలా కథానాయికలుగా నటిస్తున్నారు. అనుష్క అతిథి పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈసినిమాని పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నాగార్జున ఎక్కువగా వీల్ ఛైర్ లో కూర్చునే కనిపిస్తాడట.

,  ,  ,  ,