Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2017 14:01:35
facebook Twitter Googleplus
Photo

ఎవరి కోసమో రాసే కథలు.. ఇంకెవరి చేతికో వెళ్లడం సహజమే. అందులో కొన్ని పెద్ద హిట్టయి వాటిని వదులుకున్న హీరోలు రిగ్రెట్ అయ్యేలా చేస్తే.. ఇంకొన్ని ఫ్లాప్ అయి వాటిని మిస్ చేసుకున్న హీరోలు హమ్మయ్య అనుకునేలా చేస్తాయి. కోలీవుడ్ యంగ్ హీరో కార్తి ఈ కోవలోనే ఓ హిట్ సినిమా వదులుకున్నాడట. నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి కార్తి చేయాల్సిన సినిమా అట. ఈ సినిమాను కార్తి కథానాయకుడిగా తెలుగు తమిళ భాషల్లో తీయాలని అనుకున్నాడట డెబ్యూ డైరెక్టర్ శివ నిర్వాణ. కార్తికి ఈ కథ కూడా చెప్పాడట. కానీ కార్తి ఈ సినిమా చేయలేకపోయాడు.

ఆ తర్వాత శివ.. నానికి ఈ కథ చెప్పడం.. కోన వెంకట్ కూడా ఈ ప్రాజెక్టులోకి రావడం.. సినిమా పట్టాలెక్కడం.. సూపర్ హిట్ కావడం జరిగిపోయాయి. ఐతే కంటెంట్ పరంగా యావరేజే అయినప్పటికీ సూపర్ ఫాంలో ఉన్న నాని.. ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడన్నది వాస్తవం. కార్తి చేస్తే ఈ సినిమా ఆ స్థాయి విజయం సాధించేదా అంటే సందేహమే. కాకపోతే ఈ సినిమా తమిళంలోనూ విడుదలై ఉండేది. ఐతే తెలుగులో మాత్రం ఇప్పుడైనంత హిట్టయితే అయ్యేది కాదన్నది వాస్తవం. తాను నిన్ను కోరి సినిమాను మిస్ చేసుకున్న విషయాన్ని కార్తినే స్వయంగా వెల్లడించడం విశేషం.

,  ,  ,  ,  ,  ,