Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2017 13:49:14
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీ కట్టాలని ఎప్పట్నుంచో కలలు కంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మధ్యలో ఓ అవకాశం వచ్చినట్లే వచ్చే చేజారింది. డేట్లు సర్దుబాటు చేయలేక ఇంతకుముందు బ్రహ్మోత్సవం సినిమాను ఒప్పుకోలేకపోయింది రకుల్. ఐతే ఆ సినిమా మిస్సవడం ఆమె మంచికే అయింది. ఇప్పుడు మురుగదాస్ లాంటి ఏస్ డైరెక్టర్ తో మహేష్ చేస్తున్న స్పైడర్ మూవీలో ఆమెకు అవకాశం దక్కింది. ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర స్పైగానూ పని చేస్తుందని అంటున్నారు. టైటిల్ చూసినా అది వాస్తవమే అనిపిస్తోంది.

మరి మహేష్ కు జోడీగా నటిస్తున్న రకుల్ ఏం క్యారెక్టర్ చేస్తోందన్నది ఆసక్తికరం. ఈ విషయంపై స్వయంగా మహేష్ బాబే క్లారిటీ ఇచ్చాడు. స్పైడర్ లో ఆమె పాత్ర గురించి తమిళ మ్యాగజైన్ ఆనంద విగటన్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు మహేష్. రకుల్ ఇందులో మెడికల్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తోందని.. ఆమె పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని అతను చెప్పాడు. హీరోయిన్ పాత్రకు కూడా సినిమాలో చాలా ప్రాధాన్యముందని చెప్పాడు. ఈ సినిమాలో మహేష్-రకుల్ జోడీకి సంబంధించి కొన్ని ఎక్స్ క్లూజివ్ ఫొటోల్ని కూడా ఆనంద విగటన్ ప్రచురించడం విశేషం. తొలిసారి ద్విభాషా చిత్రం చేసిన మహేష్.. తమిళంలో ఈ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తెలుగు మీడియా కంటే ముందు తమిళ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు

,  ,  ,  ,  ,  ,