Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 10:26:20
facebook Twitter Googleplus
Photo

కార్తి కాష్మోరా పేరుతో ఓ సినిమా చేస్తున్నాడంటే.. అది మామూలు హార్రర్ సినిమా అయి ఉంటుందనుకున్నారంతా. కానీ దీని ట్రైలర్ చూశాక అందరికీ దిమ్మదిరిగిపోయింది. ఇండియన్ సినిమాలో ఈ కాష్మోరాకు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే అనిపించింది ట్రైలర్ చూస్తే. ఇది ఫలానా జానర్ సినిమా అని చెప్పలేనంత వైవిధ్యం కనిపించింది ట్రైలర్లో. విజువల్స్ అద్భుతంగా అనిపించాయి.

కార్తిని అడిగినా కాష్మోరా ఏ జానర్ సినిమానో ఒక్క మాటలో చెప్పలేం అంటున్నాడు. తన దృష్టిలో ఇది ఫాంటసీ-హార్రర్-థ్రిల్లర్-హిస్టారికల్-కామెడీ మూవీ అని చెప్పాడు కార్తి. ఈ ఐదు జానర్లకు సంబంధించిన అంశాలు ?కాష్మోరా?లో ఉంటాయన్నాడు. ట్రైలర్ చూస్తే సీరియస్ మూవీ లాగా కనిపిస్తుందని.. కానీ ఇందులో కామెడీకి కూడా ప్రాధాన్యం ఉందని.. ఈ కామెడీ సరికొత్త అనుభూతిని పంచుతుందని కార్తి తెలిపాడు.

ఇక ఈ సినిమాలో తాను పోషించిన పాత్రల గురించి చెబుతూ.. ??సినిమాలో నేను మూడు రకాల పాత్రలు పోషించాను. ఇందులో కాష్మోరా పాత్ర కీలకం. అదే లీడ్ క్యారెక్టర్. బ్లాక్ మ్యాజిక్ చేసే పాత్ర అది. ఇక రాజ్ నాయక్ యుద్ధ వీరుడిగా కనిపిస్తాడు. ఆ పాత్ర 500 ఏళ్లకు ముందు నాటి నేపథ్యంలో సాగుతుంది. ఇక మూడో పాత్ర ఏంటన్నది ఇప్పుడు చెప్పలేను. అది సస్పెన్స్. తెరమీద చూస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది?? అని కార్తి వివరించాడు. పీవీపీ సంస్థ నిర్మాణంలో గోకుల్ రూపొందించిన ?కాష్మోరా? దీపావళి కానుకగా ఈ నెల 29న విడుదలవుతుంది.

,  ,  ,  ,  ,  ,