Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2017 11:44:30
facebook Twitter Googleplus
Photo

మార్చ్ 24న.. అంటే వచ్చే శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా థియేటర్లలోకి వచ్చేస్తోన్నాడు. ఇప్పటికే రాష్ట్రం అంతటా కాటమరాయుడు హంగామా స్టార్ట్ అయిపోయింది. జనాల ఫోకస్ అంతా.. పవన్ సినిమా పైకి వచ్చేసింది. ఈ సమ్మర్ ని గ్రాండ్ గా ప్రారంభించబోతున్న పవన్ సినిమాకి.. వారం రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి.

ఆన్ లైన్ టికెట్స్ అమ్మకాలు ఓపెన్ చేయడం ఆలస్యం.. వెంటనే సేల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా రిలీజ్ రోజున టికెట్స్ కోసం అయితే.. విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. వీకెండ్స్ ముగిసేవరకూ ఈ హంగామా పీక్ స్టేజ్ లో ఉండనుంది. ఇంత హంగామా కనిపిస్తున్న పవర్ స్టార్ మూవీకి.. ఇప్పటివరకూ కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదంటే ఆశ్చర్యం వేయక మానదు. టీజర్ తో పాటు కొన్ని లిరికల్ సాంగ్స్ ను మాత్రమే ఇప్పటివరకూ ఆన్ లైన్ లో విడుదల చేశారు.

కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాని సినిమాకి ఇంత క్రేజ్ ఏర్పడ్డం చూసి.. ట్రేడ్ జనాలు విస్తుపోతున్నారు. దీనంతటికి పవన్ కళ్యాణ్ మూవీ అన్నది ఒక్కటే రీజన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవాళ హైద్రాబాద్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు కాటమరాయుడు టీం

,  ,  ,  ,  ,