Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2017 12:12:16
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాలకు అత్యంత కలిసొచ్చే సీజన్ సంక్రాంతి. ఈ సీజన్ అయ్యిందంటే మళ్లీ వేసవి వచ్చే వరకు బాక్సాఫీస్ డల్లుగా ఉంటుంది. ఫిబ్రవరి.. మార్చి నెలల్ని అన్ సీజన్ గా పరిగణిస్తారు. ఐతే గత కొన్నేళ్లలో సినిమాల తాకిడి బాగా పెరిగిన నేపథ్యంలో ఫిబ్రవరిని మన నిర్మాతలు ఫిబ్రవరిని కూడా వదలట్లేదు. ఈ ఫిబ్రవరిలో సైతం వారానికి రెండు చొప్పున సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. మరి ఈ నెలలో ఏ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుందో చూద్దాం పదండి.

నేచురల్ స్టార్ నాని మూవీ నేను లోకల్ ఫిబ్రవరికి అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. వరుస హిట్లతో ఊపుమీదున్న నాని క్రేజ్ ఈ చిత్రానికి బాగా ఉపయోగపడింది. కంటెంట్ యావరేజ్ గా ఉన్నా వినోదానికి ఢోకా లేకపోవడంతో ఈ సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రూ.30 కోట్ల షేర్ వసూళ్లలో నాని కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్టయింది. అమెరికాలో ఈ చిత్రం మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. దీంతో పాటుగా రిలీజైన మలయాళ డబ్బింగ్ మూవీ కనుపాప పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఫిబ్రవరి రెండో వారంలో రెండు పెద్ద సినిమాలొచ్చాయి. ఒకటి సూర్య డబ్బింగ్ మూవీ సింగం-3 అయితే.. ఇంకోటి నాగార్జున-రాఘవేంద్రరావుల ఆధ్యాత్మిక చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ రెండూ కూడా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. సింగం-3కి ఓపెనింగ్స్ బాగున్నాయి కానీ.. ఆ తర్వాత వసూళ్లు పడిపోయాయి. ఓం నమో..కు ఊహించని విధంగా పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా తర్వాత కూడా పుంజుకోలేకపోయింది. మంచి సినిమా అన్న పేరు మాత్రమే మిగిలింది తప్ప వసూళ్లు లేవు. బయ్యర్లకు భారీ నష్టం తప్పలేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది.

మూడో వారం వచ్చిన ఘాజీ కి అద్భుతమైన రివ్యూలొచ్చాయి. మంచి వసూళ్లూ దక్కాయి. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఇండియన్ మూవీగా ఘాజీ పేరు తెచ్చుకోవడం వివేషం. రెండో వారంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇక చివరి వారంలో వచ్చిన సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్ కు బ్యాడ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం బాగున్నాయి. తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల షేర్ తో ఆశ్చర్యపరిచిందీ సినిమా. విజయ్ ఆంటోనీ మూవీ యమన్ కు యావరేజ్ టాక్ వచ్చింది వసూళ్లు పర్వాలేదు. కానీ ఈ రెండు సినిమాలూ వీకెండ్ తర్వాత నిలబడటం కష్టంగానే ఉంది. మొత్తానికి ఫిబ్రవరి మిశ్రమ ఫలితాలతో ముగిసింది

,  ,  ,  ,  ,