Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2017 10:55:03
facebook Twitter Googleplus
Photo

ఇంతకీ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా కాటమరాయుడు ఎప్పుడొస్తోంది? దానికి సమాధానం మార్చి 24 లేదా 29 అంటూ చాలామంది డేట్లు చెప్పేస్తున్నారు. కాని అలా సినిమా రిలీజ్ అవ్వాలంటే మాత్రం పవన్ అండ్ టీమ్ చాలా కష్టపడాలిగా. ఇంతకీ అసలు కాటమరాయుడు క్యాంపులో ఏం జరుగుతోంది?

ప్రస్తుతానికి కాటమరాయుడు సినిమాకు సంబంధించిన దాదాపు షూట్ పూర్తయ్యిందట. కేవలం రెండు పాటల వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉంది. అయితే సినిమాలోని చాలా సన్నివేశాలను రామానాయుడు స్టూడియోలోనూ రామోజీ ఫిలిం సిటీలోనూ షూట్ చేయడం వలన.. వాటన్నింటికీ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ అందించాలి. అందుకే ఇప్పుడు ఈ వర్కు ఫినిష్ అవ్వడానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతోంది. కాబట్టి మార్చి 15లోపు ఇవన్నీ కంప్లీట్ అయ్యేలా ఒక ప్రణాళిక రూపొందించి.. డే అండ్ నైట్ పనిచేస్తున్నారట. అలా కంప్లీట్ అయితే కాని సినిమాను మార్చి నెలాఖరులో రిలీజ్ చేయలేరు. అది సంగతి.

డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న కాటమరాయుడు సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తన కెరియర్లో రేణు దేశాయ్ తరువాత ఇలా రెండోసారి పవన్ ఎంపిక చేసుకున్న హీరోయిన్ ఈమె మాత్రమే.

,  ,  ,  ,  ,