Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2017 11:48:32
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న కాటమరాయుడు షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఈ చిత్రంపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ భారీ స్థాయి అంచనాలున్నాయి. ఈ సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్సును సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్లో ఉన్న ఈ చిత్రంలో టాకీ పార్ట్ దాదాపు పూర్తవగా మరో మూడు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
పవన్, శృతి హాసన్ లమీద ఉండబోయే ఈ పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ త్వరలోనే విదేశాలకు వెళ్లనుంది. మరోవైపు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పాటలకు కంపోజింగ్ పూర్తి చేయగా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా రెండు పాటలను కంప్లీట్ చేశారు.

,  ,  ,  ,  ,  ,