Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2016 10:40:25
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు రీసెంట్ గా షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. పవన్ తో పాటు హీరోయిన్ శృతి హాసన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు కాటమరాయుడు చిత్రానికి రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేసేశారని తెలుస్తోంది.

2017 మార్చ్ 31న కాటమరాయుడు చిత్రాన్ని రిలీజ్ చేసేయాలని నిర్ణయించాడట పవన్ కళ్యాణ్. ఈ విషయంలో దర్శక నిర్మాతలకు ఇప్పటికే స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశాడని తెలుస్తోంది. అయితే.. ఇలా రిలీజ్ డేట్ రివీల్ చేయడంలోను.. ముందే డేట్ ఫిక్స్ చేసేయడం వెనకా చాలానే వ్యూహం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కానుందనే సంగతి ముందే చెప్పేశారు. ఈ డేట్ తో క్లాష్ వచ్చేలా సినిమా రిలీజ్ కి బహుశా ఎవరూ సాహసించకపోవచ్చు కానీ.. మహేష్ సినిమా విషయంలోనే మురుగదాస్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాహుబలి2 కంటే ముందే డేట్ ఇచ్చేయడంతో.. అదే సయానికి విడుదల కావాల్సిన ఇతర సినమాల ప్లానింగ్ కి వీలు చిక్కుతుంది. ఇందులో మహేష్ సినిమాతో పాటు అల్లు అర్జున్ డీజే కూడా ఉంటుంది. అయినా.. పవన్ కాటమరాయుడుని జనవరి నాటికే పూర్తి చేసేయాలని నిర్ణయించారు కాబట్టి.. మార్చ్ నెలాఖర్లో విడుదల చేసేయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు.

,  ,  ,  ,  ,  ,