Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jul-2016 12:23:38
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే కాస్త భిన్నంగా ప్రవరిస్తుంటాడు. తన సినిమాల ఫంక్షన్స్ కే మొక్కుబడిగా హజరయ్యే ఈ స్టార్ హీరో ఇతర సినీ వేడుకల్లో అసలే కనిపించడు. అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల వేడుకలకు వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాడు. ఇక తన అభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ కోసం మాత్రం రెండు మూడు సార్లు ఆడియో వేడుకల్లో పాల్గొన్నాడు.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూటు మారుస్తున్నాడు. ఇటీవల విడుదలైన సర్ధార్ గబ్బర్సింగ్ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్న పవన్.. తరువాత యూరప్లో జరిగిన ఓ పబ్లిక్ ఫంక్షన్కు కూడా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా మరోసారి హైదరాబాద్లో జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన నెక్ట్స్ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో అదే లుక్లో ఈ వేడుకకు హజరయ్యాడు పవన్.

,  ,  ,  ,  ,