Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Dec-2016 10:42:14
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ మూవీ గురించి కొత్త అప్ డేట్ అంటే చాలు నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శరత్ మరార్ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం జనవరి చివరికల్లా పూర్తి చేసుకోనుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం 2017లోకి అడుగు పెడుతున్న సందర్భంగా కొత్త పోస్టర్ ను వదులుతున్నారు నిర్మాతలు.

హ్యాపీ న్యూయర్ 2017 అని రాసి ఉండా.. వెనకాల అంతా బాంబులు పేలుతుంటే పవన్ ఎంచక్కా మధ్యలోంచి పంచకట్టుతో నడుస్తున్న ఫోటోను ఇచ్చింది యూనిట్. ఈ ఫోటోలో పవన్ సగం వరకే కనిపిస్తాడు. పవన్ ను పూర్తిగా చూడాలంటే న్యూఇయర్ వరకూ ఆగాల్సి వస్తుందేమో. ప్రస్తుతానికి కొత్త పోస్టర్ కి ఇది ప్రీ లుక్ అనుకోవచ్చు. అయితే.. పంచె కట్టులో పవన్ ను ఊహించుకుని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

పైగా పూర్తి మాస్ గా సగం పైకి ఎగగట్టి స్టైల్ గా నడుస్తున్న పోస్టర్ నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయిపోయింది. టాప్ ట్రెండింగ్ లోకి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కాటమరాయుడు వచ్చేశాడంటే.. అదంతా పవన్ కళ్యాణ్ మహిమ. పోస్టర్ లో సగం కనిపిస్తేనే ఇంత రెస్పాన్స్ అంటే.. ఇక మొత్తం లుక్ ను.. సినిమాను చూసేనాటికి అభిమానుల హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో.

,  ,  ,  ,  ,