Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2016 12:06:39
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజినీకాంత్.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆప్త మిత్రులన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరూ చాలా ఆత్మీయంగా మెలిగేవారు. కానీ ఈ మధ్య ఎందుకో కొంచెం దూరం పెరిగింది. ముఖ్యంగా రజినీనే మోహన్ బాబుకు కొంచెం దూరంగా ఉంటున్న అభిప్రాయం ఉంది జనాల్లో. ఈ నేపథ్యంలో మోహన్ బాబు నట ప్రస్థానానికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన భారీ వేడుకకు రజినీ రాకపోవడం చర్చనీయాంశమైంది. ఎప్పుడూ రజినీ గురించి మాట్లాడే మోహన్ బాబు.. ఈ వేడుకకు తన ఆప్త మిత్రుడిని పిలిచాడా లేదా.. మరి పిలిస్తే రజినీ ఇంత ముఖ్యమైన వేడుకకు ఎందుకు రాలేదు అని అంతా చర్చించుకుంటున్నారు.

కొన్ని రోజుల కిందటే మోహన్ బాబు.. రజినీ ఇంటికి వెళ్లి కలిసి వచ్చాడు. ఆ సందర్భంగా రజినీ కొంచెం డల్లుగా కనిపించాడు. మరి అనారోగ్య కారణాలే రజినీ రాకపోవడానికి కారణమేమో తెలియదు. తన చిన్న కూతురు ఐశ్వర్య విడాకుల గురించి వార్తలు బయటకు పొక్కిన నేపథ్యంలో రజినీ కొంచెం అప్సెట్ గా ఉన్నారని కూడా వార్తలొస్తున్నాయి. కారణాలేమైనప్పటికీ రజినీ రాకపోవడం మాత్రం ఆశ్చర్యమే. కనీసం తన మిత్రుడి కోసం ఓ ఏవీ అయినా పంపలేదు రజినీ. మోహన్ బాబు కూడా తన మిత్రుడి ప్రస్తావన తీసుకురాలేదు. ఏదేమైనా రజినీ ఈ వేడుకకు వస్తే ఆ కళే వేరుగా ఉండేది. చిరంజీవి లాంటి వాళ్లను రావాల్సిందే అని ఆర్డర్ వేసి మరీ పిలిపించుకున్న మోహన్ బాబు.. రజినీని ఎలా వదిలేశాడో

,  ,  ,  ,  ,  ,  ,