Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2016 13:52:37
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలక్రిష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ??గౌతమి పుత్ర శాతకర్ణి?? ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ?గౌతమి పుత్ర శాతకర్ణి? సినిమాను బాలకృష్ణ తన వందో సినిమాగా ఎంపిక చేసుకోవటం చిన్న విషయం కాదని అంటూనే ఒక యుగానికి నాంది పలికిన గౌతమి పుత్ర శాతకర్ణి గురించి సినిమా రూపొందించటం తెలుగువారందరికి గర్వించే విషయంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులో ఉన్న మరో కోరికను బయట పెట్టారు.
??ఈ చారిత్రక సినిమా పూర్తి అయ్యాక.. తొలిసారి వేసే షోకి నన్ను పిలవాలని కోరుకుంటున్నా. నేను కుటుంబ సమేతంగా వచ్చి చూస్తా. ఈ వేదిక మీదున్న బ్యాచ్ అంతా ఆ మొదటిషోను చూడాలి. ఆ మొదటి బ్యాచ్ లో నేనూ ఉండాలి?? అని కెసిఆర్ తన ఆకాంక్షను తెలియచేశారు. చరిత్ర అంటే ఇష్టమున్న కెసిఆర్ మరోసారి తన ఇష్టాన్ని ఈ కోరిక ద్వారా బయటపెట్టాడు. దాదాపు యాభై కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాని దర్శకుడు క్రిష్ తన స్వంత బానర్ పై నిర్మిస్తుండటం మరో విశేషం.

,  ,  ,  ,  ,  ,  ,