Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2017 12:21:33
facebook Twitter Googleplus
Photo

సెంటిమెంట్స్ ఎక్కువగా ఉండే సినిమా ఇండస్ట్రీలో ఒకసారి స్టాంప్ అంటూ పడ్డాక దాన్ని తుడిచేయడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఐరన్ లెగ్ అని స్టాంప్ పడితే.. వాళ్ల కష్టాలు మామూలుగా ఉండవు. కమల్ హాసన్ చిన్నకూతురు అక్షర హాసన్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది.

అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడు.. ధనుష్ లాంటి ట్యాలెంటెడ్ హీరో నటించిన బాలీవుడ్ మూవీ షమితాబ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అక్షర. ఆ మూవీ పేలిపోవడంతో బాలీవుడ్ డ్రీమ్స్ నెరవేరలేదు. ఆ తర్వాత ఎలాగోలా కష్టపడి మరో ప్రాజెక్టులో చోటు సంపాదిస్తే.. ఆమె సైన్ చేసిన ఆ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఒకటి ఫ్లాప్.. మరొకటి మొదలే లేదు. ఇలాంటి సిట్యుయేషన్ లో మరింతగా ట్రైనప్ అవడానికి.. తండ్రి దగ్గరకు వచ్చేసింది అక్షర. కమల్ హాసన్.. శృతి హాసన్ లు నటిస్తున్న శభాష్ నాయుడు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయింది.

కమల్ అనారోగ్యం కారణంగా ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు అక్షరపై ఐరన్ లెగ్ అనే స్టాంప్ పడిపోయింది. నిజానికి శృతి హాసన్ కి కూడా మొదట ఇదే స్టాంప్ ఉండేది. దాన్ని అధిగమించి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగిన అక్క శృతిహాసన్ నే స్ఫూర్తిగా తీసుకుంది అక్షర. గబ్బర్ సింగ్ మూవీతో శృతిపై ఉన్న స్టాంప్ ను తుడిచేసి.. టాప్ స్టార్ చేసేశాడు పవన్ కళ్యాణ్. మరి అక్షరపై ఉన్న ఐరన్ లెగ్ బ్రాండ్ ను తుడిచేసేందుకు ఏ స్టార్ రావాలో!

,  ,  ,  ,  ,