Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Dec-2017 15:35:43
facebook Twitter Googleplus
Photo

ఫ్యాషన్ కు మారుపేరులాగా.. వయ్యారానికి నిలువుటద్దంలా ఎదురుగా ఓ సొగసుల సింగారి నిలబడి ఉంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. అదే ఇద్దరు అలా నిల్చుని ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరిని చూడాలని నిర్ణయించుకోవడం కాస్త కష్టమే కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హీరోయిన్లు కీర్తి సురేష్- అను ఇమ్మానుయేల్ ఇద్దరూ డిఫరెంట్ డ్రస్సుల్లో హాజరై చూపరుల మతులు పోగొట్టారు.

ఈ ఫంక్షన్ లో ఇద్దరూ కొత్త ఫ్యాషన్ కు సింబల్స్ లా కనిపించారు. కీర్తి సురేష్ రెడ్ కలర్ శారీ.. బ్లాక్ టాప్స్ తో ఇంతకు ముందెన్నడూ కనిపించని రీతిలో డిఫరెంట్ గా దర్శనమిచ్చింది. అను ఇమ్మానుయేల్ ట్రాన్స్ పరెంట్ శారీలో కొంచెం హాట్ గా కనిపించింది. దీంతో ఆడియన్స్ ఫోకస్ ఎక్కువ అను మీదనే కాన్సన్ ట్రేట్ అయి కనిపించింది. వీళ్లిద్దరూ తమ మాటల్తో హీరో పవన్ ను ఆకాశానికెత్తేశారు. అను ఇమ్మానుయేల్ అయితే త్రివిక్రమ్ తో మరోసారి చేయాలని ఉందని తనకు ఇంకా ఛాన్సులు ఇవ్వాలని సభాముఖంగా అడిగేసింది. ఇంతకుముందు పవర్ స్టార్ సినిమాలను స్క్రీన్ పై చూసి ఫ్యాన్ అయ్యానని.. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసి ఆఫ్ స్క్రీన్ లోనూ ఆయనకు ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చింది.

కీర్తి-అను ఇద్దరూ చాలా మంచి నటులని.. వాళ్ల పంక్చువాలిటీ పద్ధతులకు శాల్యూట్ చేస్తున్నానంటూ డైరెక్టర్ త్రివిక్రమ్ కితాబిచ్చాడు. వాళ్లిద్దరిదీ ఈ భాష కాదు. పుట్టి పెరిగింది ఇక్కడ కాదు.. అయినా వాళ్లు తెలుగును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు

,  ,  ,  ,  ,  ,