Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Dec-2017 12:08:40
facebook Twitter Googleplus
Photo

ఆడియోఫంక్షన్ లో పవన్ స్పీచ్ హైలైట్ అవడంలో ఆశ్చర్యం లేదు. సినిమాను.. పాలిటిక్స్ ను దేశాన్ని కలిపి పవర్ స్టార్ మాట్లాడిన మాటలు అందరినీ అలరించాయి.ఇంత ప్రేమను.. ఇంత అభిమానాన్ని.. సినిమా ద్వారా ఇచ్చిన మన దేశానికి వందనాలు తెలుపుకుదాం. భారత్ మాతా కీ జై.భారత్ మాతా కీ జై.భారత్ మాతా కీ జై. ఇక్కడికి వచ్చిన అందరితో పాటు.. రాలేకపోయిన వారికి.. బైట ఉండిపోయిన మన అభిమానులు అందరికీ.. స్థలం చిన్నది కావడం వల్ల బైట ఉండిపోయిన బైట చిక్కుకుపోయిన ప్రతీ ఒక్కరికీ ముందస్తుగా నా క్షమాపణలు. నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే.. అభిమానించే ప్రతీ ఒక్కరినీ గుండెల్లో పెట్టుకోవాలని ఉంటుంది. కానీ హృదయం వైశాల్యంగా ఉన్నా..శరీరం చిన్నది. మీ అందరికీ పేరుపేరునా.. టీవీల్లో చూస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ థ్యాంక్స్ చెప్పాడు పవన్.

నేను సినిమాల్లోకి వచ్చినపుడు ఎపుడూ ఇంత అభిమానాన్ని పొందుతానని అసలేమీ అనుకోలేదు. ఇంత అభిమానం సంపాదిస్తా అని కూడా అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నా మనసులో ఉన్న కోరిక.. నా వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగపడే చిన్నపని చేస్తే చాలు. కానీ సినిమాల ద్వారా మీకింత చేరువైనందుకు.. నాదైన కృషి పొలిటికల్ పార్టీ ద్వారా చేయగలిగే అవకాశం ఇచ్చిన సినిమాకి.. నాకింత ప్రేమనిచ్చిన.. ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లే ప్లాట్ ఫాం ఇచ్చిన సినిమాకి.. ఆ తల్లికి.. నా పాదాభివందనాలు అంటూ కళామతల్లికి కృతజ్ఞతలు తెలిపాడు.

నేను సినిమాల్లోకి వచ్చిన ప్రారంభంలో ఎన్ని సినిమాలు చేస్తావ్ అని ఇంట్లో అడిగితే.. నాకు ఓ పది పన్నెండు కనిపించాయంతే. ఖుషీ తర్వాత ఇంకో ఐదు సినిమాలు చేసి సినిమాల్లోంచి వెళ్లిపోదామని అనుకున్నాను. దానికి కారణం కూడా చెబుతాను. అదేంటంటే.. నాకు దేశం చాలా గొప్పది.. పెద్దది. అంతే తప్ప సినిమా చిన్నదని కాదు. కానీ మీ ప్రేమ నాతో పాతిక సినిమాలు చేసేలా చేసింది. ఈ పాతిక సినిమాల్లో ముఖ్యంగా ఖుషీ తర్వాత.. పోస్ట్ జానీ తర్వాత.. నేనెప్పుడూ ఓటమికి భయపడలేదు. అలాగే గెలుపుతో కూడా ఎప్పుడూ పొంగిపోలేదు. కానీ మనకు సంబంధం లేకుండా మన పని చాలా అసూయ ద్వేషాలను ఇస్తుందని చిత్ర పరిశ్రమలో తెలుసుకున్నాను. ఒక్కోసారి నాకు ఇలాంటి ఫీలింగ్స్ మధ్య సినిమాలు చేయాలంటే.. అవి విరమించుకునేందుకు నా మనసెప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

,  ,  ,  ,  ,  ,