Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Feb-2015 11:26:01
facebook Twitter Googleplus
Photo

కథ బాగుంటే ఎన్ని వేషాలు వేయడానికైనా మన హీరోలు సిద్ధంగా వున్నారు. ఈ క్రమంలో ఇటీవలే సూపర్ హిట్టయిన 'కత్తి' సినిమాలో రెండు పాత్రలు పోషించి మెప్పించిన తమిళ హీరో విజయ్ ఇప్పుడు ఏకంగా మూడు పాత్రలు ధరిస్తున్నాడు. శింబు దేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో ఈ హీరో ఇలా త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. ఈ మూడు పాత్రలూ కూడా వేటికవే విభిన్నంగా ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాకి 'పులి' అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో విజయ్ సరసన శ్రుతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటి శ్రీదేవి ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

,  ,  ,  ,  ,