Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 10:30:11
facebook Twitter Googleplus
Photo

వెండితెర మీద తిరుగులేని హవా సాగించిన మెగాస్టార్ చిరంజీవికి బుల్లి తెర మాత్రం అస్సలు కలిసి రావట్లేదు. ఆయన తొలిసారి హోస్ట్ గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో అంచనాల్ని అసలేమాత్రం అందుకోలేకపోయింది. ఆరంభం నుంచి పేలవమైన టీఆర్పీ రేటింగులతో చిరు అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఏ దశలోనూ పుంజుకోని ఈ షోను ఎలాగోలా పూర్తి చేశాడు చిరు. ఇక చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 ప్రిమియర్ షో విషయంలోనూ చిరుకు ఇలాంటి అనుభవమే తప్పలేదు. థియేటర్లలో ఇరగాడేసి నాన్-బాహుబలి కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసిన ఈ చిత్రం.. టెలివిజన్ ప్రిమియర్ గా మాత్రం సరైన ఆదరణ పొందలేకపోయింది.

మే 28న ఆదివారం రోజు ముందు నుంచి బాగా ప్రచారం చేసి ప్రిమియర్ షోగా ఖైదీ నెంబర్ 150 ని ప్రసారం చేస్తే.. దానికి కేవలం 6.9 టీఆర్పీ రేటింగే వచ్చింది. టీఆర్పీ రెండంకెల సంఖ్యలో కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సిల్వర్ స్క్రీన్లో మాదిరే.. బుల్లితెర మీదా చిరు సినిమా రికార్డుల వేట సాగిస్తుందనుకుంటే.. చెత్త రేటింగ్ తెచ్చుకున్న పెద్ద సినిమాల రేసులో నిలిచింది. గత ఏడాది మహేష్ బాబు డిజాస్టర్ మూవీ బ్రహ్మోత్సవం కూడా ఇంతకంటే మెరుగ్గా 7.52 టీఆర్పీ రేటింగ్ నమోదు చేయడం విశేషం. ఎన్నడూ లేని విధంగా ప్రిమియర్ షో సందర్భంగా ఖైదీ నెంబర్ 150 లో రెండు పాటల్ని (రత్తాలు రత్తాలు-అమ్మడు కుమ్ముడు) రెండేసిసార్లు ప్రసారం చేయడం విశేషం. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. అలా చేసినా ఇలాంటి రేటింగే రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అదే రోజు మరో ఛానెల్లో ఐఫా ఉత్సవ వేడుకల్ని ప్రసారం చేయడమే ఖైదీ..ని దెబ్బ కొట్టిందని భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,