Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2016 13:15:59
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. మీడియం రేంజ్ సినిమాలకు ఓ మెట్టు దిగువన ఉండే సినిమాలతో సరిపెట్టుకున్న నాని.. నేచురల్ స్టార్ అనిపించుకున్నాక స్టార్ హీరోల సినిమాలకు దగ్గరగా చేస్తున్నాడు. టెక్నికల్ గా అదే రేంజ్ వాల్యూస్ తో ఉండేలా అన్నీ సెట్ అవుతున్నాయి నానికి.

ఇప్పటివరకూ నాని మూవీకి ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించలేదు. కానీ ఈ కాంబినేషన్ కు ఇప్పుడు నాంది పడింది. నేచురల్ స్టార్-రాక్ స్టార్ లను కలుపుతున్నాడు దిల్ రాజు. దిల్ రాజు బేనర్లో నాని చేయబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ కు డీఎస్పీని ఫైనలైజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి.

నాని-డీఎస్పీల కాంబినేషన్ ను సెట్ చేసేందుకు డైరెక్టర్ త్రినాథరావు ఇప్పటికే రాక్ స్టార్ ను కలిశారు. స్టోరీని కంప్లీట్ గా నేరేట్ చేసి థీమ్ గురించి తమకు అవసరమైన స్టైల్ గురించి వివరించారట. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జెంటల్మన్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు నాని. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,