Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2015 10:33:33
facebook Twitter Googleplus
Photo

సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్ అనగానే మనకు 'కిక్' సినిమా గుర్తొస్తుంది. ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ అందరినీ అలరించడమే కాకుండా, కమర్షియల్ గా పెద్ద హిట్టయింది కూడా. దానిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో 'కిక్ 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 7న రిలీజ్ చేస్తున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంలో ఆలస్యం జరుగుతుండడం వల్ల ఇది వాయిదా పడుతున్నట్టు సమాచారం. మే 15న దీనిని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,