Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jul-2017 12:13:11
facebook Twitter Googleplus
Photo

శ్రీవాస్ దగ్గర టార్గెట్స్ పెద్దవే ఉన్నాయి. లక్ష్యం అంటూ అరంగేట్రంలోనే మంచి హిట్ సాధించడంతో.. పెద్ద సినిమా ఆఫర్లనే అందుకుంటున్నాడు. అయితే.. ఈ డైరెక్టర్ కి బాలీవుడ్ పై ఎప్పటి నుంచి కన్ను ఉంది. నందమూరి బాలకృష్ణతో డిక్టేటర్ ను రూపొందించిన తర్వాత.. ఆ సినిమా ప్రచార సమయంలో అదే సినిమాను బాలీవుడ్ లో కూడా తీయనున్నట్లు చెప్పాడు శ్రీవాస్.

అయితే.. ఆ ప్లాన్ వర్కవుట్ అవలేదు కానీ.. తన మరుసటి చిత్రం విషయంలో మాత్రం మళ్లీ బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నాడు శ్రీవాస్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక మూవీలో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మరుసటి చిత్రం శ్రీవాస్ డైరెక్షన్ లోనే రూపొందనుంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాడట ఈ దర్శకుడు. తన కథకు బాలీవుడ్ జనాలను మెప్పించే స్థాయి ఉందని బలంగా విశ్వసిస్తున్నాడట.

ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ పోషించే పాత్రను.. హిందీలో టైగర్ ష్రాఫ్ తో చేయించాలని భావిస్తున్నాడట శ్రీవాస్. త్వరలోనే టైగర్ ష్రాఫ్ ను కలిసి స్టోరీపై నెరేషన్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం.. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకేసారి చిత్రీకరించి.. బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేసేయాలని శ్రీవాస్ ఫిక్స్ అయిపోయాడని టాక్.

,  ,  ,  ,  ,