Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2016 11:35:53
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో రామ్- కిషోర్ తిరుమల కాంబినేషన్ లో 2016 ప్రారంభంలో వచ్చిన మూవీ నేను శైలజ. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ లోకి వచ్చి రామ్ ఊపిరి పీల్చుకుంటే.. దర్శకుడు కిషోర్ తిరుమలకు మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ మూవీలో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ కెరీర్ బాగా ఊపందుకుంది.

అయితే.. ఆ తర్వాత వీరంతా వేరే వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నించారు. క్యూట్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్న హీరో రామ్ మళ్లీ మాస్ రూట్లోకి వచ్చేసి హైపర్ అనే సినిమా చేస్తే జనాలు తిప్పికొట్టారు. ఇటు కిషోర్ తిరుమల వెంకటేష్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఆడాళ్లూ మీకు జోహార్లు అనే సినిమాకి సిద్ధమవుతున్న టైంలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దీంతో డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన రామ్ తోనే మళ్లీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట కిషోర్ తిరుమల.

ఇప్పటికే రామ్ కి ఈ దర్శకుడు ఓ స్టోరీ లైన్ చెప్పడం.. హీరో ఓకే అనేయడం.. రామ్ సైన్ చేసేయడం కూడా జరిగిపోయాయట. నేను..శైలజ టైంలోనే ఈ స్టోరీని రామ్ కి చెప్పాడన్నది మెయిన్ పాయింట్. ఇప్పుడా లైన్ నే డెవలప్ చేసి సినిమాగా సిద్ధం చేస్తున్నారట ఈ హిట్ కాంబినేషన్ హీరో అండ్ డైరెక్టర్!

,  ,  ,  ,  ,