Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2017 13:46:15
facebook Twitter Googleplus
Photo

మన దేశంలో క్రీడకారులుకు భలే క్రేజ్ ఉంటుంది. ఈ దేశంలో వాళ్ళని ఆరాధించే అంతగా మరి ఎవ్వరిని చేయరు. ఇంకా చెప్పాలంటే.. దేశానికి సేవ చేసే ఒక మంచి నాయకుడుకు కూడా అంతా ఫాలోయింగ్ ఉండదు. ఇక అంత క్రేజ్ ఉంటే కార్పొరేట్ బ్రాండ్స్ ఊరికే ఎందుకు ఉంటాయి వీళ్ళని ప్రచారకర్తలుగా పెట్టుకొని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇది తప్పు కాదు కానీ సెలబ్రిటీలకు అవసరం లేకపోయినా కేవలం మనీ కోసం కొందరు చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మన దేశం క్రికెట్ కెప్టెన్ కోహ్లీ ని చూసి కొంచెం నేర్చుకోవాలి.

కొందరు సెలబ్రిటీలు.. నమ్మే విషయాలు ఒకటి.. వాళ్ళు అమ్మే వస్తువులు వేరొకటి. ఒక నూనె అమ్ముతారు కాని వాళ్ళు అది వాడరు. వాళ్ళు చెప్పులు బ్రాండ్ వేరు మనకు అమ్మే చెప్పులు వేరు. వాళ్ళు కొన్న టూత్ పేస్ట్ ఒకటి ప్రచారం చేసేది ఒకటి. తలకు వాడే షాంపూ కానివ్వండి ఒంటికి రాసే సబ్బు కానివ్వండి అన్నీ ఇలానే ఉంటాయి వాళ్ళ ప్రచార హరికథలు. నాసిరకం బట్టలకు కూడా గొప్పగా ప్రచారం చేస్తారు మన తెలుగు హిరోయిన్లు అయితే. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ వస్తువులుకు నాణ్యమైన వస్తువులుకు వాళ్ళు చేస్తే పరవాలేదు కానీ చైనా మొబైల్సుకు లోకల్ చీప్ బ్రాండ్లకు అర్ధం లేని బ్యూటీ క్రీమ్ లకు అందం పెంచుకోమనే చెప్పే కాస్మెటిక్ ప్రకటనలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులుకు ప్రచారం చేస్తారు మనవాళ్లు.

సాఫ్ట్ డ్రింక్స్ మానేసిన కోహ్లీ పెప్సి కొ బ్రాండ్ ను పబ్లిసైజ్ చేయడం విరమించుకున్నాడు. ఆరు ఏళ్లుగా దానికి ప్రచారకర్తగా ఉండి ఒకసారి ఎందుకు చేయడం మానేశారు అంటే అతని ఇచ్చిన సమాధానం చూడండి “ నేను ఏమైతే వాడతానో వేటిని నమ్ముతానో వాటిని ప్రచారం చేయడంలో అర్ధం ఉంది కానీ నాకు సంబంధం లేని వస్తువులను నేను ఎలా ప్రచారం చేయగలను చెప్పండి. అది మంచి పద్దతి కాదు నా దృష్టిలో. కేవలం డబ్బు కోసం నేను ఆ పని ఒప్పుకోలేను'' అని చెప్పాడు

,  ,  ,  ,  ,  ,