Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Oct-2017 09:50:35
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ మీద బయోపిక్ తీసేందుకు ఏడాదిగా సన్నాహాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంతలోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హఠాత్తుగా ఎన్టీఆర్ మీద తాను సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే ఈ చిత్ర ప్రి లుక్ కూడా రిలీజ్ చేసేశాడు. ఇంకొన్ని రోజుల్లోనే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఎవరు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. నిజ జీవిత కథలతో సినిమాలు తీసేటపుడు వర్మ ఆయా పాత్రలకు తగ్గ నటీనటుల్ని ఎంచుకుని వారిని మౌల్డ్ చేయడంలో వర్మ శైలే వేరు.

ఇక ఎన్టీఆర్ పాత్ర విషయానికొస్తే.. ఇందుకు ప్రకాష్ రాజ్ సరైన ఛాయిస్ అని వర్మ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ను సంప్రదించినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఓకే అంటే ఈ ప్రాజెక్టుకు భలే క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. ఐతే వర్మ తీయబోయేది లక్ష్మీపార్వతి కోణంలోని ఎన్టీఆర్ జీవిత గాథ కాబట్టి ఇందులో అనేక వివాదాస్పద అంశాలుంటాయి. ఈ చిత్ర బృందం అనేక వివాదాలు - ఆందోళనల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అప్పట్లో ఎన్టీఆర్ ను అనుకరిస్తూ కోట శ్రీనివాసరావు చేసిన ‘మండలాధీశుడు’ తరహాలో వ్యతిరేకత వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఈ పాత్ర చేసి వివాదాల్ని కొని తెచ్చుకోవాలని అనుకుంటాడా అన్నది చూడాలి.

,  ,  ,  ,