టాలీవుడ్ లో వచ్చిన సరికొత్త చిత్రం అర్జున్ రెడ్డి. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతగా కిక్ ఇచ్చిందో అందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ నటన అందరిని చాలా ఆకట్టుకుంది. ఇక సినిమాలో అతని గెటప్ కూడా చాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా గడ్డం లుక్ తో విజయ్ ఒక్కసారిగా క్రేజ్ ను అందుకున్నాడు . అయితే ఆ లుక్ ని చాలా మంది ఫాలో అయ్యారు. ఎక్కువగా అర్జున్ రెడ్డి పోస్టర్ల లో కూడా అదే లుక్ కనిపించింది.
సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యింది. అంతే కాకుండా కొంత మంది మార్ఫింగ్ కూడా చేశారు. ఇక అసలు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ కి బాగా సెట్ అయిన ఆ లుక్ మిగతా హీరోలకు ఎంతవరకు సెట్ అవుతుందో తెలియదు గాని కోలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది. మార్ఫింగ్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది.
విజయ్ దేవరకొండ కూడా ఆ ఫొటోని పోస్ట్ చేశాడు. అందులో కమల్ హాసన్ రజినీ కాంత్ విక్రమ్ సూర్య అజిత్ విజయ్ విజయ్ సేతుపతి ధనుష్ వంటి స్టార్స్ అర్జున్ రెడ్డి లుక్ లో కనిపింఛారు.