Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Nov-2016 11:00:25
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు కొరటాల శివకు టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. ముందు రైటర్ గా ప్రూవ్ చేసుకుని.. ఇప్పుడు డైరెక్టర్ గా 3 సినిమాలు చేసిన కొరటాల.. ఆ మూడింటితోనూ ఆయా హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇవ్వగా.. ఇందులో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. టాలీవుడ్ టాప్5 లిస్ట్ తీస్తే.. అందులో ఈయన తీసిన సినిమాలు రెండు ఉన్నాయంటేనే.. కొరటాల కన్సిస్టెన్సీ అర్ధమవుతుంది.

ఇప్పుడు తన పారితోషికం పెంచుకునేందుకు కొరటాల వేసిన ఓ స్కెచ్ నిర్మాతలకే కాదు.. ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ కొట్టించేసింది. అది కూడా మహేష్ బాబుతో సినిమా చేస్తూ.. ప్లాన్స్ వేస్తుండడంతో మరింత హాట్ టాపిక్ అయిపోయింది. మహేష్ తో సినిమా కోసం 13 కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న కొరటాల శివ.. ఆ అమౌంట్ తో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అందుకే తనకు అమౌంట్ కు బదులుగా ఓవర్సీస్ హక్కులు ఇచ్చేయమని అడుగుతున్నాడట.

ఓవర్సీస్ లో సూపర్ స్టార్ సినిమాలు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వసూళ్లు సాధిస్తుంటాయి. మహేష్-కొరటాల మూవీ అంటే కనీసం 15 కోట్లు అయినా వచ్చేయడం ఖాయం. అందుకే 15 కోట్లకు మించి షేర్ వస్తే కనుక ఫిఫ్టీ ఫిప్టీ చేసుకుందామని నిర్మాతలకు ఆఫర్ ఇచ్చాడట కొరటాల. దీనిపై ఇంకా ప్రొడ్యూసర్స్ డిసైడ్ కాలేదు కానీ.. ఇప్పటికైతే కొరటాల ఐడియా మాత్రం ఫిలింనగర్ లో హాట్ ఇష్యూ అయిపోయింది.

,  ,  ,  ,  ,  ,