Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2015 14:16:28
facebook Twitter Googleplus
Photo

ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఓకే అయింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా కుదిరింది. ఈ నెల 28న హైదరాబాద్ లో ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టేయబోతున్నారు. కొరటాలతో ?శ్రీమంతుడు? సినిమాను నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. శ్రీమంతుడు తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అతడికి అడ్వాన్సు కూడా ఇచ్చేశారు మైత్రి మూవీస్ అధినేతలు. డైరెక్టర్ గా కొరటాలనే అనుకున్నారు కానీ అతనే ఓ పట్టాన సినిమా ఓకే చేయలేదు.

అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని స్టార్ లతో చెయ్యడని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం కొరటాల దర్శకత్వంలో నటించడానికి చాలా ఆసక్తితో ఉన్నట్లు.. ఆ విషయమే మైత్రి నిర్మాతలకు క్లియర్ గా చెప్పినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఎన్టీఆర్ తో కొరటాలకు మంచి సాన్నిహిత్యమే ఉంది కూడా. ఇంతకుముందు ఎన్టీఆర్ సినిమా బృందావనం కి మాటలు అందించింది కొరటాలే. ఏదైతేనేం మొత్తానికి రెండు పెద్ద హిట్లు కొట్టడంతో పాటు మంచి పేరు కూడా సంపాదించిన దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేయబోతుండడం నందమూరి అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయమే. ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేనితో సైతం ఒక సినిమా చేస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

,  ,  ,  ,