Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2015 17:29:55
facebook Twitter Googleplus
Photo

మోకాలికి బోడి గుండుకి ముడిపెట్టడం అంటారే.. ఇది సరిగ్గా అలాంటి వ్యవహారమే. దాదాపు ఏడాది కిందట విజయ్ హీరోగా నటించిన ?కత్తి? సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా చుట్టూ అప్పట్లో చాలా వివాదాలే నడిచాయి. ఇది కాపీ కథ అంటూ కొందరు ఆరోపణలు చేశారు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తో డైరెక్టర్ మురుగదాస్ గొడవ చాలా దూరం వెళ్లింది. ?కత్తి?కి సంబంధించి ఇంకొన్ని కేసులు కూడా నడిచాయి. ఐతే వాటిలో చాలా వరకు పరిష్కారమైపోయాయి కానీ.. అన్బు రాజశేఖర్ అనే నిర్మాత వేసిన కేసు మాత్రం ఇప్పటికీ తేలలేదు. తాను తీసిన ?త్యాగభూమి? అనే షార్ట్ ఫిలిం ఆధారంగానే ?కత్తి? తీశారన్నది అతడి ఆరోపణ.

ఐతే ఇన్నాళ్లు ఈ కేసు ఏమైందో తెలియదు కానీ.. సడెన్ గా విజయ్ కొత్త సినిమా ?పులి? విడుదలకు రెడీ అవుతుండగా మళ్లీ వివాదం రాజుకుంది. తన కేసు సంగతి తేల్చకుండా ?పులి? విడుదల కావడానికి వీల్లేదంటూ రాజశేఖర్ తంజూవూరు కోర్టులో పిటిషన్ వేశాడు. ఐతే ?కత్తి? సినిమాలో హీరోగా నటించడం తప్పితే విజయ్ కి ఆ కథకు ఏం సంబంధం? పిటిషన్ వేస్తే గీస్తే మురుగదాస్ తీయబోయే సినిమా మీద వేయాలి కానీ విజయ్ నటించిన వేరే సినిమాకు అడ్డం పడటమే విడ్డూరం. అతను పిటిషన్ వేయడమే ఆశ్చర్యమైతే.. కోర్టు దాన్ని విచారణకు స్వీకరించడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది కోర్టు. మరి ఆ రోజు ఏం జరుగుతుందో చూడాలి. అప్పటికి విడుదలకు మూడు రోజులే సమయం ఉంటుంది. మరి కోర్టు పిటిషన్ కొట్టేస్తుందా.. ?పులి?కి చెక్ పెట్టే ఆదేశాలేమైనా వస్తుందా అని టెన్షన్లో ఉన్నారు దర్శక నిర్మాతలు.

,  ,  ,  ,