Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 12:46:34
facebook Twitter Googleplus
Photo

కొరటాల శివ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఒక సిట్యుయేషన్ డిఫరెంట్ యాంగిల్ నుంచి చూడగలగడమే కాదు.. చూపిస్తాడు కూడా. గతంలో ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ కు రీషూట్స్ చేస్తున్నారనే టాక్ వచ్చినపుడు.. ఏ సినిమాకి అయినా రీషూట్ చేస్తున్నారంటే.. అది మంచి విషయమేనంటూ.. జనాల ఆలోచన యాంగిల్ మార్చేశాడు.

ఇప్పుడు అదే కొరటాల శివ ఒక విషయంలో డిస్టర్బ్ అయాడు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న భరత్ అనే నేను మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి మహేష్ బాబు స్టిల్ ఒకటి ఆన్ లైన్ లో లీక్ అయింది. ఇది కొరటాలను బాగా డిస్టర్బ్ చేసింది. దయచేసి ఆన్ లైన్ లో ఎవరూ ఈ ఫోటోను తిరిగి షేర్ చేయవద్దని.. అభిమానులు కూడా ఇది పక్కాగా ఫాలో కావాలని విన్నవించాడు. మంచి ఔట్ పుట్ ఇచ్చేందుకు తాము ఎంతో శ్రమిస్తున్నట్లుగా చెప్పిన కొరటాల.. లీక్ విషయంలో జనాలను బాగానే బతిమిలాడుకున్నాడు. ప్రస్తుతం ఈ లీక్ ఎక్కడి నుంచి జరిగిందనే విషయంపై టీం మల్లగుల్లాలు పడుతోంది.

ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలుసుకుంటే.. ఫ్యూచర్ లో అడ్డుకట్ట వేయవచ్చని వారి ఆలోచన. ఆ సంగతలా ఉంటే.. ఇంతకీ చిన్నపాటి లింక్ దొరికితే డొంకంతా కదిల్చేసే ఆన్ లైన్ మీడియా రోజుల్లో.. ఇలా ఒక లీక్ ను ఇకపై షేర్ చేయకండి అని కొరటాల అడగడం విచిత్రమే కానీ.. దీన్ని పాటించే వాళ్లు ఎవరైనా ఉంటారా అన్నదే అసలు పాయింట్.

,  ,  ,  ,  ,  ,