Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 10:36:31
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు క్రిష్ ట్యాలెంట్ పై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకపోయినా.. కమర్షియల్ సక్సెస్ లు కొట్టలేడనే ఓ స్టాంప్ మాత్రం ఇప్పటివరకూ ఉంది. తాజాగా బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో.. ఆ ముద్రను చెరిపేసుకున్నాడు ఈ డైరెక్టర్. అంతే కాదు.. చారిత్రక చిత్రంతో చరిత్ర సృష్టించే కలెక్షన్స్ రాబట్టచ్చని నిరూపించాడు. అదే జోష్ తో మరో రెండు హిస్టారికల్ మూవీస్ తీస్తానని కూడా చెప్పేశాడు.

క్రిష్ చెప్పిన ఆ రెండు సబ్జెక్టులు ఏంటంటే.. శ్రీకృష్ణ దేవరాయలు.. గౌతమబుద్ధుడు. వీరి జీవితాలను తెరకెక్కించడం అంత సులువైన పనేమీ కాదు. బుద్ధుడి సంగతి అలా ఉంచితే.. శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను పోషించేది ఎవరు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోతోంది. టాలీవుడ్ హీరోల్లో ఇలాంటి పాత్ర చేయాలంటే నందమూరి బాలకృష్ణ పేరు మాత్రమే వినిపిస్తుంది. పైగా ఆయన ఇప్పటికే ఆదిత్య 369లో ఇదే పాత్రను పాతికేళ్ల క్రితమే మెప్పించిన తీరు మర్చిపోలేం. ఇప్పుడు వేరేవాళ్లను చూడాలన్నా కొంచెం కష్టమేలే.

మరి బాలయ్యతోనే తన నెక్ట్స్ మూవీని క్రిష్ ప్లాన్ చేసుకున్నాడా అనే డౌట్ సహజం. క్రిష్ కి వెంకీతో అనుకున్న సబ్జెక్ట్ క్యాన్సిల్ అయింది. బాలయ్య కూడా 101విషయంలో ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. మరోసారి బాలయ్య-క్రిష్ కాంబినేషన్ సాధ్యమవుతుందా అంటే అవునని చెప్పే పరిస్థితి కాదు. వరుసగా ప్రయోగాలు చేయాలని బాలయ్య కూడా అనుకోరు. ఒకే వంశంతో సినిమా తీస్తాడనే స్టాంప్ వేయించుకునేందుకు క్రిష్ ఇష్టపడడు. మరి క్రిష్ మదిలోని దేవరాయలు ఎవరబ్బా!

,  ,  ,  ,  ,