Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2017 11:58:22
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫుల్ బిజీ. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసేస్తూ.. అమాంతం తన స్థాయిని పెంచేసుకుంది. అమ్మడి ఖాతాలో మరో హిట్ పడిందంటే.. ఇక రకుల్ స్టార్ అయిపోయినట్లే. నిజానికి ఈ భామ చేతిలో ఉన్న ప్రాజెక్టులను చూస్తే.. ఇప్పటికే రకుల్ ఆ స్టేటస్ ను అందుకుందని చెప్పాలి.

నాగచైతన్యకు జోడీగా రకుల్ ప్రీత్ నటించిన రా రండోయ్ వేడుక చూద్దాం ఈ నెల 26న విడుదల కానుంది. జనాలకు కలకాలం గుర్తుండిపోయే ఓ లవ్ స్టోరీ చేయాలన్నది ఎప్పటినుంచో నా ఆలోచన. అందుకు తగినట్లుగానే ఈ సినిమాలో నా భ్రమరాంబ కేరక్టర్ ఉంటుంది. జనాలు ఎంతగానే ఈ పాత్రను ప్రేమిస్తారు. నా కెరీర్ లోనే బెస్ట్ అనదగ్గ రోల్ ఇది. మొదట దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ పాత్ర గురించి నాకు వివరించినపుడు.. మెస్మరైజ్ అయ్యాను . కానీ డేట్స్ ఇచ్చేందుకు ఖాళీ లేని పరిస్థితి. అయితే.. ఎంత బిజీ అయినా ఈ రోల్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని దర్శకుడికి చెప్పాను అంటోంది రకుల్.

ఇది కాకుండా మరో నాలుగు సినిమాలను చేసేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబుతో తొలిసారిగా జోడీ కట్టగా.. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ మూవీ షూటింగ్ ను కూడా రకుల్ పూర్తి చేసేస్తోంది. ఇప్పటికే ఈమె వంతు టాకీ పార్ట్ పూర్తి కాగా.. మరో రెండు పాటల కోసం మహేష్ తో కలిసి ఫారిన్ వెళ్లనుంది రకుల్.

,  ,  ,  ,  ,