Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2017 17:35:34
facebook Twitter Googleplus
Photo

మన హీరోలు ప్రచారం ఆ సినిమా పాత్రను బట్టి చేస్తున్నారు. సినిమాలో వేసిన వేషం ఎలా ఉంటే దానికి దగ్గరగా ఉన్నట్లు మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రకమైన ప్రచారం మంచి సక్సెస్ కూడా అవుతుంది. యంగ్ హీరో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఈ వారం విడుదలకాబోతుంది. ఈ సినిమాలో రానా ఒక పొగురున్న యువ రాజీకియా నాయకుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లో కానీ పోస్టర్ లో కానీ చాలా వరకు తెల్ల చొక్కా తోడుక్కొని తెల్ల పంచె కట్టుకొని కనిపిస్తున్నాడు. సినిమా విడుదల తేది కూడా దగ్గరపడటంతో సినిమా ప్రచారం జోరు పెంచాడు రానా.

ఈ సినిమా ప్రచారం భాగమై ఉండవచ్చు రానా ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ కి వెళ్ళిన తెల్ల చొక్కా తెల్ల పంచె వేసుకొని వెళ్తున్నాడు. ఒక టివి చానల్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో రానా కొంచెం అదుపు తప్పి ఒక మాట జారాడు. సినిమాలో జోగేంద్ర అనుకోని అలా అనేశాడా ఏంటి అనుకున్నారు అక్కడ ఉన్నవారంతా. ఈ మధ్య డ్రగ్స్ వ్యవహారంలో రానా పేరు కూడా వినిపించింది. దానికి వివరణ కూడా రానా ఇచ్చాడు అనుకోండి. కాకపోతే మళ్ళీ ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక టివి చానెల్ కి వెళ్ళితే అక్కడ ఒక యాంకర్ మీ పేరు కూడా డ్రగ్స్ విషయంలో వినిపిస్తుంది దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగితే దానికి రానా వీరావేశం తో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకు అని చేయి చూపించి మాట్లాడాడు. ఇదే కాకుండా నేనే రాజు నేనే మంత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక ఫేమస్ యాంకర్ ని పెట్టి కొంతమంది చిన్న నటులతో వెటకరంగా కొన్ని ప్రశ్నలు అందరి పై వేయించి నానా రబస చేశాడు. తన సినిమా కోసం ఆవేశంగా నటించడా లేక తనే నైజమే అంతేనా అనేది ఎవరికి అర్ధం కాలేదు. కట్ చేస్తే.. నిజంగా ఆ ఇంటర్యూలో అలా అరవలేదు. తరువాత వేరే క్లిప్పింగ్ లో అది కనిపించింది. అంటే కేవలం ప్రమోట్ చేయడానికి అలా అరిచాడనమాట.

యాంకర్లు పై అరవడాలు ఈవెంట్ పెట్టి కేవలం అరవడమే పనిగా చేస్తే అది ప్రచారం ఎలా అవుతుందో చూసే వారికి అంతుపట్టడం లేదు. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ను సురేశ్ బాబు ప్రొడ్యూస్ చేశాడు.

,  ,  ,  ,  ,