Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 15:28:40
facebook Twitter Googleplus
Photo

ఇటు మహేష్ బాబు కెరీర్లో.. అటు కృష్ణవంశీ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో మురారి ఒకటి. అప్పటి పరిస్థితుల్లో తెలుగులో అలాంటి సినిమా రావడం ఊహకందని విషయం. మహేష్ బాబులోని నటుడిని తొలిసారి బయటికి తీసిన సినిమా అది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నమైన రీతిలో మురారిని తెరకెక్కించాడు కృష్ణవంశీ. ముందు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని సూపర్ హిట్టయింది మురారి. ఐతే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కృష్ణవంశీకి మిగతా యూనిట్ సభ్యులకు మధ్య పెద్ద గొడవే జరిగిందట. ఓ దశలో కృష్ణవంశీ ఈ సినిమా నుంచి బయటికి వెళ్లిపోవడానికే రెడీ అయిపోయాడట. ఆ అనుభవం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ వివరించాడు.

??మురారి చేయడానికి ముందు మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు.. వంశీ డిజాస్టర్స్ అయ్యాయి. మహేష్ ఎగ్జిస్టన్స్ మీదే అందరికీ సందేహాలు కలిగాయి. మరోవైపు మహేష్ కాంపిటీటర్ అయిన పవన్ కళ్యాణ్ దూసుకెళ్లిపోతున్నాడు. దీంతో ఆశలన్నీ ?మురారి? సినిమా మీదే ఉన్నాయి. ఐతే ఇది కమర్షియల్ సినిమా కాదని.. ప్రయోగాత్మక చిత్రం అని వాళ్లందరూ ఫీలయ్యారు. దీనికి తోడు క్లైమాక్స్ ముందర అలనాటి రామచంద్రుడు.. పాట పెట్టడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం అక్కడ మాంచి మాస్ మసాలా పాట ఉండాలి. అలా కాకుండా అలనాటి రామచంద్రుడి.. పాట ఏంటి అని యూనిట్లో అందరి మధ్య డిస్కషన్ జరిగింది. మహేష్ కూడా నన్ను ఏమీ అడగలేకపోతున్నాడు. పెద్ద డైరెక్టర్.. పైగా నచ్చి చేస్తున్నాను అని ఊరుకున్నాడు. మిగతా వాళ్లు ఈ పంచాయితీని కృష్ణగారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన కూడా కమర్షియల్ సాంగ్ పెట్టొచ్చు కదా అన్నారు. నేను రెండు ఆప్షన్స్ ఇచ్చాను. ఈ పాటతో సినిమా చేయనివ్వండి. లేదా వేరే వాళ్లతో మీరు కోరిన కమర్షియల్ పాట పెట్టుకుని సినిమా రిలీజ్ చేసుకోండి.. నా పేరు మాత్రం వేయొద్దు అనేశాను. ఈ సినిమాలో ఆ చండాలం కుదరదని ఖరాఖండిగా చెప్పేశాను. అలనాటి రామచంద్రుడి.. పాట ఉంటే కొన్ని దశాబ్దాల పాటు ఆ పాట.. సినిమా నిలిచిపోతాయని చెప్పాను. సరే కానివ్వమన్నారు. సినిమా రిలీజయ్యాక ఈ పాటకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఐతే ఈ పాట విషయంలో అంత పట్టుబట్టాను కాబట్టి నన్ను మూర్ఖుడు అన్నారు?? అని కృష్ణవంశీ తెలిపాడు.

,  ,  ,  ,  ,  ,