Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2017 10:02:41
facebook Twitter Googleplus
Photo

రెండేళ్లు వెనక్కి వెళ్తే.. అప్పటికి నానిది ప్రమాదకర పరిస్థితి. వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోతాడేమో అన్న సందేహాలు కలిగాయి. ఆరు నెలలకు పైగా అతడి చేతిలో అసలు సినిమానే లేదు. ఇలాంటి స్థితిలో ఎవడే సుబ్రమణ్యం తో మొదలుపెట్టి ఇప్పుడు నేను లోకల్ వరకు నాని ప్రస్థానం ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలు సినిమాల్ని కూడా తన నటనతో నిలబెట్టగలిగే ప్రతిభ అతడిది. అందుకే అతను చేస్తున్న ఓ మోస్తరు సినిమాలు అదరగొట్టేస్తున్నాయి. అందుకు తాజా రుజువు నేను లోకల్. ఈ సినిమా యావరేజ్.. రొటీన్ కంటెంట్ తోనే వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ఇప్పుడు స్టార్ హీరోల కంటే కూడా నాని సినిమా అంటే ప్రేక్షకులు.. బయ్యర్లు.. దర్శక నిర్మాతలు.. అందరిలోనూ ఒక భరోసా. నాని అయితే తమ కథలకు న్యాయం చేస్తాడని రచయితలు.. దర్శకులకు భరోసా.. నాని సినిమా అయితే లాభాలు గ్యారెంటీ అని నిర్మాతలకు భరోసా.. నాని సినిమా అయితే కచ్చితంగా బాగుంటుందని ప్రేక్షకులకు భరోసా.. ఇలా అందరికీ భరోసా ఇస్తున్నాడు నాని. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో మిగతా కథానాయకులు.. ముఖ్యంగా వారసత్వ హీరోలు నానిని చూసి భయపడే పరిస్థితి నెలకొంది. నిర్మాతలు.. దర్శకులు అతడి కోసం పరుగులు పెడుతుండటంతో వీళ్ల ప్రాధాన్యం తగ్గిపోయే పరిస్థితి వస్తోంది. నాని దూకుడు ఇలాగే కొనసాగితే.. వేరే హీరోలతో చేయాలనుకున్న సినిమాల్ని కూడా నానికి మళ్లించే రోజులొస్తాయి మున్ముందు. ఈ నేపథ్యంలో మిగతా హీరోలు జాగ్రత్త పడాల్సిందే.

,  ,  ,  ,  ,  ,