Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Aug-2017 14:23:09
facebook Twitter Googleplus
Photo

దర్శకుల్లో కృష్ణవంశీకి క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరుంది. ఎప్పటికప్పుడు విలక్షణ కథలతో ప్రేక్షకులను అలరించడానికి కృష్ణవంశీ ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతే కాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం కృష్ణవంశీది. తనకంటూ ఇండస్ట్రీలో ఓ గుర్తిపు వచ్చినా ఇప్పటికీ తన మూలాలను మరచిపోలేదు. ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మకు అసిస్టెంట్ గానే భావిస్తుంటానని కృష్ణవంశీ చెప్పడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. తాను నిత్య విద్యార్థినని - ఇప్పటికీ డైరెక్షన్ లో పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నానని అంటున్నాడు కృష్ణవంశీ. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణవంశీ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

తనకు బాహుబలి సినిమా చాలా బాగా నచ్చిందని కృష్ణవంశీ చెప్పాడు. ఆ సినిమా చూసినప్పుడు దర్శకత్వమంటే ఇది అని అనిపిస్తూ ఉంటుందన్నాడు. మణిరత్నం గారిలా ఓ సినిమా తీయాలని .. బాపు గారిలా ఒక పాటను చిత్రీకరించాలని తనకు అనిపిస్తుందని చెప్పాడు. అలాంటి సినిమాలు చేసిన రోజున తాను దర్శకుడినేనని అనిపిస్తుందని అన్నాడు. అలా అనుకున్న రోజున సినిమాలు ఆపేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పేశాడు కృష్ణవంశీ.

,  ,  ,  ,