Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Dec-2017 10:25:44
facebook Twitter Googleplus
Photo

కొత్తగా ఉండే కథతో వస్తే హిట్ కొట్టకపోయినా మరో అవకాశాన్ని దక్కించుకుంటాడు అని మాత్రం చెప్పవచ్చు. అందుకే చాలామంది హీరోలు ఎక్కువగా కొంచెం కొత్తగా ఉండే కాన్సెప్ట్ లతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే తరహాలో అల్లు శిరీష్ కూడా అన్నయ్య బన్నీలానే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని సరికొత్త కథతో రాబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరక్కేక్కిన ఒక్క క్షణం అనే సినిమా ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమాపై కొంత వరకు అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ కూడా ఓ వర్గ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి హిట్ అందుకున్న విఐ.ఆనంద్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం మరో ప్లస్ పాయింట్. ఇకపోతే రీసెంట్ గా సినిమా శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ జెమిని ఛానెల్ భారీ ధరకు కొనుగోలు చేసింది. మొత్తంగా 3.20 కోట్లకు కొన్నట్లు టాక్ వినిపిస్తోంది.

అల్లు శిరీష్ కెరీర్ లో ఏ సినిమా కూడా ఈ స్థాయిలో అమ్ముడుపోలేదు. దీంతో ఇప్పుడు శాటిలైట్ రేట్ ను చూస్తుంటే సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ అందుతోంది. సినిమా విడుదల తర్వాత కూడా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా తప్పకుండా మినిమమ్ వసూళ్లను సాదించగలదనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,