Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2017 14:01:51
facebook Twitter Googleplus
Photo

ఒక సమస్యను.. పాయింట్ ను తీసుకుని.. అప్పటివరకూ ఎవరూ చూపించని.. చూపించలేని కోణంలో సినిమాను మలుస్తాడు. అందుకే కృష్ణవంశీ సినిమాలంటే.. తప్పకుండా ఏదో కొత్తదనం ఉంటుందని ఆడియన్స్ నమ్ముతారు.

ఇప్పుడు నక్షత్రం అంటూ ప్రేక్షకుల ముందుకు కొత్త సినిమా తీసుకొస్తున్నాడు కృష్ణవంశీ. సందీప్ కిషన్-రెజీనా జంటగా నటించిన ఈ సినిమాలో.. సాయిధరం తేజ్- ప్రగ్యా జైస్వాల్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పోలీసులపై జనాల దృక్పథం మారుతుందని.. గౌరవం పెరుగుతుందని అంటున్నాడు కృష్ణవంశీ. గోవిందుడు అందరివాడే అంటూ గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా తర్వాత.. పూర్తి వైవిధ్యం ఉండేందుకే ఈ స్టోరీని ఎంచుకున్నట్లు చెప్పిన కృష్ణవంశీ.. ప్రస్తుతం నక్షత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

బాహుబలి సిరీస్ లో శివగామిగా రమ్యకృష్ణ ఆ స్థాయిలో మెప్పించిన క్రెడిట్ అంతా దర్శకుడికి.. ఆ పాత్రను సృష్టించిన రైటర్ కు ఇస్తానంటున్నాడు ఆమె భర్త కృష్ణవంశీ. ఆమె కూడా ఆ పాత్రను బాగా మెప్పించిందని చెబుతున్నాడు. అయితే.. తాను మాత్రం రమ్యకృష్ణతో సినిమా తీయడం సాధ్యం కాదని.. అసలు ఆమెను ఓ నటిగా తాను చూడనని.. కుటుంబ అనుబంధాల కారణంగా.. తన సినిమాల్లోకి తీసుకోబోనని తేల్చేశాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.

,  ,  ,  ,